టాలీవుడ్ సినిమా దగ్గర కొన్ని ట్రెండ్ సెట్టింగ్ సినిమాల జాబితాలో ఖచ్చితంగా ఉండే అతి కొద్ది సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విలేజ్ రివెంజ్ డ్రామా రంగస్థలం తప్పకుండా వుంటుంది. అయితే ఈ సినిమాలో ప్రతీ ఒక్క నటుడు పోషించిన పాత్రలు తమ కెరీర్ నే ఓ రేంజ్ లో మలుపు తిప్పాయి. అలా గుర్తుండిపోయే పాత్రల్లో వెర్సటైల్ నటుడు జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ గారు పాత్ర కూడా ఒకటి. దీనిపై జగపతి బాబు లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
తన కెరీర్లో చాలా తక్కువ పాత్రలు మాత్రమే తను గుర్తు పెట్టుకునే విధంగా ఉంటాయి అన్నట్టు తెలిపారు. గత 70, 80 సినిమాల్లో చూసుకుంటే ఐదారు సినిమాల్లో పాత్రలు మాత్రమే గుర్తుంటాయని ఆ తక్కువలో కూడా రంగస్థలం లో చేసిన పాత్ర కూడా ఒకటని తను తెలిపారు. అదే ఏడాదిలో వచ్చిన అరవింద సమేత లో రోల్ కంటే దీనినే పిక్ చేసుకుంటాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో జగ్గూ భాయ్ తెలిపారు. సో రంగస్థలం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ లెవెల్ అని చెప్పవచ్చు.


