సాలిడ్ పోస్టర్ తో “ఆచార్య” పై బిగ్ అప్డేట్ వదిలిన మేకర్స్.!

Published on Aug 4, 2021 4:28 pm IST


మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బ్లాక్ బస్టర్ దర్శకుడు తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆచార్య” కోసం మెగా ఫాన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అలాగే ఈ చిత్రం కూడా కొత్త రిలీజ్ డేట్ కి సన్నద్ధం అవుతుందని కూడా తెలుస్తుంది. అయితే మరి ప్రస్తుతం ఈ చిత్రం షూట్ లాస్ట్ స్టేజ్ లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ఈ షెడ్యూల్ స్టార్టింగ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ ను రివీల్ చేసారు. ఈ చిత్రంకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యిపోయింది అలాగే ఇంకా రెండు పాటల తాలూకా షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందని కన్ఫర్మ్ చేశారు.

అంతే కాకుండా ఈ అప్డేట్ తో చిరు మరియు చరణ్ లు కలిసి అడవిలో ఉన్న సాలిడ్ పోస్టర్ ని కూడా నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు వదిలారు. దీనితో చాలా కాలంగా ఓ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఎట్టకేలకు ఒక అప్డేట్ వచ్చినట్టు అయ్యింది. ఇక ఈ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డేలు నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :