వాయిదా పడ్డ మెగాస్టార్ ఆచార్య…విడుదల అయ్యేది అప్పుడేనా?

Published on Apr 27, 2021 11:00 am IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం మే 13 వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, తాజాగా ఈ చిత్ర యూనిట్ విడుదల తేదీ పై ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆచార్య చిత్రాన్ని మే 13 వ తేదీన విడుదల చేయడం లేదు అని ఆ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపనీ ప్రకటించింది. అయితే పరిస్థితి మళ్ళీ సాధారణం గా మారిన తర్వాత కొత్త విడుదల తేదీ ను ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. మాస్క్ ధరించండి, ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్ట్ 22 వ తేదీన ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా లో కథానాయిక గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మరొక కీలక పాత్ర లో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :