ఫ్యాక్ట్..”ఆచార్య”కి చిరు, చరణ్ ల రెమ్యునరేషన్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!

Published on Apr 24, 2022 8:00 am IST

లేటెస్ట్ గా విడుదలకి సిద్ధం అవుతున్న లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ లేటెస్ట్ సెన్సేషనల్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా మెగా ఫ్యాన్స్ లో ఎంతో కీలకంగా నిలిచి ఎప్పుడు నుంచో భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

అయితే ఈ సినిమాకి నిన్ననే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ వేదికపై ఈ సినిమా నిర్మాత మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకుడు అయినటువంటి నిరంజన్ రెడ్డి పలు ఆసక్తికర కామెంట్స్ చెయ్యడం జరిగింది. ఈ సినిమాని చిరంజీవి మరియు రామ్ చరణ్ లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసారని.

వారి రెమ్యునరేషన్స్ మరియు పలువురు హీరోలకి సంబంధించి అనేక మాటలు చాలా మంది అంటుంటారని అవన్నీ అబద్దం అని ఈ సినిమాకి అయితే తమ హీరోలు ఎలాంటి డబ్బు తీసుకోలేదని సినిమా రిలీజ్ అయ్యాక దానికి వచ్చే ఫలితం మరియు వసూళ్ల బట్టి చూద్దాం అని చెప్పి మా సినిమా చేసారని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని అయితే తాను సభాముఖంగా తెలియజేసారు.

సంబంధిత సమాచారం :