ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో అలర్ట్ చేస్తున్న “ఆచార్య” టీం.!

Published on Jul 10, 2021 7:16 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో “ఆచార్య” అనే బిగ్ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి కరోనా రెండో వేవ్ మూలాన మిగిలి ఉన్న కాస్త షూట్ ను మేకర్స్ ఇటీవలే స్టార్ట్ చేశారు.

మరి దీనిపైనే ఒక అధికారిక అప్డేట్ ను అదిరే పోస్టర్ తో పొందుపరిచారు. చరణ్ చేస్తున్న సిద్ధ పాత్రపై పోస్టర్ ను వదిలి మళ్ళీ ధర్మస్థలికి తలుపులు తెరుచుకున్నాయని ఫైనల్ షెడ్యూల్ పై అప్డేట్ ఇచ్చేసారు. అలాగే రానున్న రోజుల్లో ఎగ్జైటింగ్ అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నామని కూడా అలర్ట్ చేస్తున్నారు.

దీనితో ఈ చిత్రం నుంచి ఇంకొన్ని రోజుల్లో మోస్ట్ అవైటెడ్ గా చూస్తున్న సెకండ్ సింగిల్ రావడం ఖాయం అని చెప్పాలి. అలాగే ఈ చిత్రంలో చరణ్ సరసన పూజా హెగ్డే చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :