కొరటాల శివకు చిరంజీవి సీరియస్ వార్నింగ్ !

Published on Jan 26, 2021 10:35 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఏంటి, దర్శకుడు కొరటాల శివకు వార్నింగ్ ఇవ్వడమేమిటి అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ‘ఆచార్య’ సినిమా విషయంలో చిరు కొరటాలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే అది సీరియస్ వార్నింగ్ కాదులెండి స్వీట్ వార్నింగ్. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన చిరు ‘ఆచార్య’ టీజర్ అప్డేట్ గురించి తనదైన కామెడీ స్టైల్లో అప్డేట్ ఇచ్చారు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా పలు సినిమాల అప్డేట్స్ వచ్చాయి. వాటిలో పెద్ద సినిమాలు కూడ ఉన్నాయి. కానీ చిరు సినిమా అప్డేట్ మాత్రం లేదు.

అభిమానులంతా సినిమా టీజర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇవ్వలేదు టీమ్. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిరు మాత్రం కాస్త ఆలస్యమైనా కూడ రిలీజ్ డేట్ ఫైనల్ చేశారు. తనకు, కొరటాల శివకు సీరియస్ డిస్కషన్ జరిగిందన్న చిరు ‘ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్ న్యూఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు. ఇంకెప్పుడు. ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా’ అనడం. దానికి కొరటాల అదే పనిలో ఉన్నాను సర్. రేపు మార్నింగ్ పక్కాగా ఇచ్చేస్తాను, 10 గంటలకు చెప్పేస్తాను అన్నట్టు ఒక ఫన్నీ మీమ్ క్రియేట్ చేసి ట్విట్టర్లో పెట్టారు. ఇలా కామెడీ చమత్కారంతో టీజర్ అప్డేట్ ఇచ్చి తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూపారు చిరు.

సంబంధిత సమాచారం :