“సైరా” కి ముందు డేట్ లాక్ చేసిన “ఆచార్య”.?

Published on Aug 4, 2021 4:25 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” అనే హై బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఇపుడు ఆల్ మోస్ట్ షూట్ ముగింపుకు చేరుకోనుండగా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది ఆసక్తిగా మారింది. అయితే తాజాగా మెగాస్టార్ ఓ రిలీజ్ డేట్ కి మొగ్గు చూపిస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

మరి దాని ప్రకారం ఆచార్య చిత్రం వచ్చే అక్టోబర్ నెల 1న విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారట. అయితే ఇదే అక్టోబర్ నెలలోనే సరిగ్గా దీనికి ఒకరోజు తర్వాత మెగాస్టార్ లాస్ట్ భారీ చిత్రం “సైరా నరసింహా రెడ్డి” 2న రిలీజ్ అయ్యింది. మరి ఇదే ఫార్మాట్ లో ఆచార్య ఒకరోజు ముందుగా నిజంగానే రిలీజ్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా కాజల్ మరియు పూజా హెగ్డే లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :