సోలో డేట్ కోసం ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ ?

Published on Aug 16, 2021 9:01 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మాటకొస్తే ఎప్పటి నుంచో ఏ డేట్ అయితే బెటరో అని మెగాస్టార్ టీమ్ పరిశీలిస్తోంది. విడుదల తేదీ కోసం ఒక సోలో డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదే ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.

అయితే, దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటే.. అప్పుడు “ఆర్ఆర్ఆర్” రెడీగా ఉంది. ఇక క్రిస్మస్ కి బన్నీ “పుష్ప” ఉంది. అలాగే భారీ సినిమా “కేజీఎఫ్ 2” కూడా క్రిస్మస్ కే రిలీజ్. దీనికితోడు కరోనా మూడో వేవ్ తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తే.. మళ్ళీ అన్ని సినిమాల విడుదల తేదీలు తారుమారు అయిపోతాయి. ఇక ఆచార్య సినిమాలో చిరు – చరణ్ కాంబినేషన్ అదిరిపోతోందట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :