మెగా ఫ్యాన్స్ కు “ఆచార్య” ఒక బిగ్గెస్ట్ ఫీస్ట్.!

Published on Mar 17, 2021 12:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మరి ఈ చిత్రంలో చిరు తో పాటుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ చిత్రం తాలూకా హైప్ మరో లెవెల్ కి వెళ్ళింది.

అయితే ఈ చిత్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ చిరు మరియు చరణ్ ల మధ్య సీన్స్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను బయట పెట్టింది. వారిద్దరి మధ్య సీన్స్ మెగా ఫ్యాన్స్ కు గట్టి ట్రీట్ ఇచేలా ఉంటాయని అంతే కాకుండా కొరటాల శివ చాలా కేరింగ్ గా వాటిని తీర్చిదిద్దారని తెలిపింది.

ముఖ్యంగా చిరు రోల్ సాలిడ్ గా ఉంటుంది అని ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కు అయితే బాగా నచ్చుతుంది అని కాజల్ తెలిపింది. మొత్తానికి మాత్రం కొరటాల ఈసారి గట్టిగానే మెగా ఫ్యాన్స్ పై దృష్టి పెట్టినట్టు ఉన్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం వచ్చే మే 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :