“హరిహర వీరమల్లు” పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్!

“హరిహర వీరమల్లు” పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన యాక్షన్ కొరియోగ్రాఫర్!

Published on Dec 21, 2022 3:00 PM IST

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి విడుదల, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న చిత్రం హరి హర వీర మల్లు. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి ఇది మొదటి పాన్ ఇండియా మూవీ. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామా. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ చిత్రం గురించి భారీ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలోని ఓ మేజర్ యాక్షన్ సీక్వెన్స్ నిన్ననే పూర్తయిందని, స్టార్ నటుడితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్‌పై నిరంతర ప్రేమ, మద్దతు పై కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి సీక్వెన్స్ కోసం ఇప్పుడు సన్నాహాలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎ. దయాకర్ రావు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమా కి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు