క్రేజీ కాంబినేషన్ లో రానున్న యాక్షన్ త్రిల్లర్ !

Published on May 28, 2019 3:00 am IST

ఎలాంటి పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో ఆ పాత్రను రక్తికట్టించే నటుడు విక్రమ్. కాగా టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ప్రముఖ తమిళ్ నిర్మాత లలిత్ కుమార్ నిర్మణంలో ఓ సినిమా రాబోతుంది. ‘7 స్క్రీన్ స్టూడియో, వయాకమ్ 18’ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ఆరంభం కానుంది. 2020 వేసవి వినోదాత్మక చిత్రంగా దీన్ని విడుదల చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక కళాకారుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇక ‘డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్’ వంటి చిత్రాలతో అజయ్ జ్ఞానముత్తు దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ వంటి భిన్నమైన కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :

More