ఫేస్‌బుక్ నేపథ్యంలో ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’!

Friends-Request

‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ధనలక్ష్మీ ఐ లవ్ యూ’ సినిమాలతో మనల్ని మెప్పించిన నటుడు ఆదిత్యా ఓమ్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన తాజా సినిమా ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఫేస్‌బుక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాను విజయ్ వర్మ పాకాలపాటి నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేస్తూ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ టీమ్ ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో హీరో, దర్శకుడు ఆదిత్యా ఓం మాట్లాడుతూ.. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందిందని, తనకిది మంచి రీ ఎంట్రీ సినిమాగా నిలుస్తుందని తెలిపారు. ఇక నిర్మాత విజయ్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అన్ని కార్యక్రమాలు పూర్తి కాగానే విడుదల తేదీ ప్రకటిస్తామని తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాకు లవన్-వీరల్ సంగీతం సమకూర్చగా, సిద్ధార్థ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

Exit mobile version