హిందీ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ ఇక లేరు !

Published on Aug 9, 2021 10:00 am IST

హిందీ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ ఇక లేరు. ఆయన వయసు 63 సంవత్సరాలు. అనుపమ్‌ శ్యామ్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా ఇంట్లోనే డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. కానీ, నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో జాయిన్ చేశారు.

అయితే, అనుపమ్‌ శ్యామ్‌ కు చికిత్స అందించినా.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. నిన్న రాత్రి ఆయన మృతి చెందారు. అనుపమ్‌ ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ వంటి పలు టీవీ సీరియల్స్‌ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు, క్వీన్‌ వంటి సినిమాల్లోనూ అనుపమ్‌ శ్యామ్‌ నటించి మెప్పించారు. ‘123తెలుగు.కామ్’ నుండి అనుపమ్‌ శ్యామ్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :