బెంగళూరులో ‘జిస్మత్ మండీ’ ప్రారంభం.. సందడి చేసిన నటుడు ధర్మ మహేష్

బెంగళూరులో ‘జిస్మత్ మండీ’ ప్రారంభం.. సందడి చేసిన నటుడు ధర్మ మహేష్

Published on Feb 7, 2026 6:00 AM IST

1 1

ప్రముఖ సినీ నటుడు ధర్మ మహేష్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని బెంగళూరుకు విస్తరించారు. తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందిన ‘జిస్మత్ మండీ’ (Zismath Mandi) నూతన శాఖను బెంగళూరులోని మారతహళ్లిలో ఆయన ఘనంగా ప్రారంభించారు. నాణ్యమైన ఆహారాన్ని, నోరూరించే రుచులను భోజన ప్రియులకు అందించడమే లక్ష్యంగా ఈ ఔట్‌లెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

​ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ, ‘జిస్మత్’ అనేది తన కుమారుడి పేరులోని భావమని, ఈ బ్రాండ్ ప్రయాణం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. బెంగళూరు నగరంతో తనకున్న పాత అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. హనుమాన్ జంక్షన్, గన్నవరం వంటి చిన్న పట్టణాల నుంచి వచ్చిన తనకు, 2008లో బెంగళూరులో అడుగుపెట్టడం తన జీవితాన్ని మలుపు తిప్పిందని తెలిపారు. నాడు ఓ సామాన్యుడిగా వచ్చి, నేడు అదే నగరంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

​వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తాజా మాంసంతో వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. లాభాల కంటే కస్టమర్ల సంతృప్తినే తాను విజయంగా భావిస్తానని ధర్మ మహేష్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు