విషాదం : ప్రముఖ నటుడు మృతి !

Published on Aug 2, 2021 11:04 am IST


తెలుగు నటుడు ఇరుగు గిరిధర్‌ మృతి చెందారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమైవడంతో మానసికంగా చాలా కృంగిపోయారు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం అసలు బాగాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలోని తన
నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇరుగు గిరిధర్‌ దర్శకుడు కూడా కావడం విశేషం. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు. శుభముహూర్తం అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు.

గిరిధర్‌ మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘123తెలుగు.కామ్’ నుండి ఇరుగు గిరిధర్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :