తన సినీ ప్రయాణం, కష్టాలను పంచుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు లతీష్

తన సినీ ప్రయాణం, కష్టాలను పంచుకున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ నటుడు లతీష్

Published on May 3, 2026 8:00 AM IST

కిరణ్ అబ్బవరం దాదాపు 50 మంది నూతన ఆర్టిస్టులను పరిచయం చేస్తూ నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో ‘సిద్ధయ్య’ అనే ప్రతినాయకుడి పాత్రలో నటించిన లతీష్ తన అద్భుత నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. తాజాగా ఆయన తన సినీ ప్రయాణాన్ని, కష్టాలను మీడియాతో పంచుకున్నారు.

​నగరిలోని ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన లతీష్, 2017లో హైదరాబాద్ చేరుకుని అవకాశాల కోసం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, బీ-స్టూడియోలో డా. షేక్ జాన్ బషీర్ వద్ద నటనలో ఉచితంగా శిక్షణ పొందారు. అక్కడ పలు నాటకాల్లో నటిస్తుండగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ బృందం ఆయన్ను గుర్తించి ఆడిషన్స్ ద్వారా అవకాశం కల్పించింది.

​సిద్ధయ్య పాత్రకు న్యాయం చేసేందుకు లతీష్ ఏకంగా 30 కిలోల బరువు పెరిగి తీవ్రంగా శ్రమించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ చూసి కిరణ్ అబ్బవరం, నరేష్ అగస్త్యతో పాటు ఆయన గురువు బషీర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. గురువుగారు ఇన్‌స్టిట్యూట్‌లో తనను ఆలింగనం చేసుకోవడం జీవితంలో మర్చిపోలేని క్షణమని లతీష్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం బీ-స్టూడియోలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న ఆయన, పలు కొత్త ప్రాజెక్టుల కథలు వింటున్నట్లు వెల్లడించారు.

తాజా వార్తలు