యస్.యమ్. కె ఫిలిమ్స్ మరియు వి.యన్.ఆర్.ఫిలిమ్స్ పతాకాలపై మోహన్ కృష్ణ ,వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్. కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ మణికొండ లోని శివాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు సాగర్ గారు హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశం పై గౌరవ దర్శకత్వం వహించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు, జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏ.ఎస్ రవికుమార్ గారు స్క్రిప్ట్ అందించారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, మోహన్ గారు చిరంజీవి కి హార్డ్ కోర్ ఫ్యాన్, ఆయన చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా టైటిల్ తో సినిమా తీస్తున్నాడు, చిరంజీవి గారి ఘరానా మొగుడు ఎంత ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే, ఇప్పుడు తను తీస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, మోహన్ కృష్ణ నాకు మంచి మిత్రుడు తను డిఫరెంట్ సబ్జెక్ట్ ను సెలక్ట్ తీసుకొని మూవీ తీస్తాడు అని, వాణి విశ్వనాథ్ నా చిత్రంలో నటించింది, ఇప్పుడు ఈ ఘరానా మొగుడు చిత్రంలో వాణి విశ్వనాథ్ కూతురు వర్శ విశ్వనాథ్ నటిస్తున్నందంటే ఇది సొంత బ్యానర్ లాంటిదే అని అన్నారు. ఈ చిత్రం మోహన్ కు, వర్శ విశ్వనాథ్ కు మంచి విజయం సాధించి వారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అని అన్నారు.
ఏ.యస్ రవికుమార్ మాట్లాడుతూ, 1992 లో చిరంజీవి గారి ఘరానా మొగుడు చిత్రం గొప్ప సంచలనం సృష్టించిందని, ఆ చిత్రం లాగే ఈ మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుతూ ఈ చిత్ర బృందానికి మంచి పేరు రావాలని అన్నారు.
హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రొడక్షన్ లో ఈ మూవీ చెస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు .తన మొదటి సినిమా రెడ్డి గారి ఇంట్లో రౌడీ ఇజం విడుదల కు సిద్ధంగా ఉందని, తన సెకండ్ మూవీ తన అమ్మగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ లో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
చిత్ర నిర్మాత, హీరో, మోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటివరకు తను బావ మరదలు, మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ సినిమాలు తీయడం జరిగింది అని అన్నారు. ఇది ప్రొడక్షన్ నెంబర్ 3 లో చిరంజీవిగారు నటించిన ఘరానా మొగుడు టైటిల్ తో చిత్రం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్ గారి కూతురు విశ్వనాథ్ గారు నటిస్తున్నారు అని అన్నారు. దర్శకుడు తనకు చెప్పిన కథ నచ్చడంతో సినిమా తీయడానికి ముందుకు వచ్చా అని వ్యాఖ్యానించారు. మంచి సబ్జెక్టు తీసుకొని మంచి కంటెంట్ తో వస్తున్న ఈ ఘరానా మొగుడు చిత్రం అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు.
చిత్ర దర్శకుడు రాజుబాబు మాట్లాడుతూ, తనకు చిరంజీవి గారు అంటే ఎనలేని అభిమానం అని, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగా అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఘరానా మొగుడు సినిమా వచ్చినప్పుడు తను సెవెంత్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ వ్రాస్తున్నా అని, సినిమా చూసిన తర్వాత సినిమాపై మక్కువ ఏర్పడిందని చెప్పారు. ఆ తరువాత 1999 లో సినిమా ఇండస్ట్రీ కి వచ్చానని, 2019 వరకు పలు దర్శకుల దగ్గర పని చేసినట్లు తెలిపారు. మొదటిసారి మోహన్ కృష్ణ గారికి కథ చెప్పడంతో ఆయన ఈ సినిమాను చేద్దామని చెప్పారు అని అన్నారు. ఇది తన మొదటి సినిమా అని, తను చూసిన మొదటి సినిమా ఘరానా మొగుడు టైటిల్ కు దర్శకత్వం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో దర్శకులపై పూరి గారు నేనింతే తీశాడు, దానికి పూరి గారు భిన్నంగా చూపించడం జరిగింది, అలాంటి కాన్సెప్ట్ తోనే సినిమా చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఇది ఒక దర్శకుడి సినిమా, మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినీ దర్శకుడి కథ అంటూ స్పష్టం చేశారు. ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా తీసుకొని ఘరానా మొగుడు స్టోరీని చేయడం జరిగిందని, ఒక సినీ దర్శకుడు సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత, దర్శకుడు ఎలాంటి ఆశలతో భావాలతో వస్తాడు ఎలాంటి అంకితభావంతో పని చేస్తాడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని తను ఎలా దర్శకుడిగా నిర్వర్తిస్తాడు అదే సమయంలో అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి తన జీవితంలో ఎదురైన తరువాత ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథతో ఈ సినిమా తీయడం జరిగింది అని తెలిపారు. తన పుట్టిన రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందని, తాము చేస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.



