హేమ ఆరోపణలు పై నరేష్ వివరణ !

Published on Aug 9, 2021 1:35 pm IST

నటి హేమ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ కి సంబంధించి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మా అధ్యక్షుడు, నరేష్ ఆమె వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ‘హేమ పై చర్యలు తీసుకుంటామని చెబుతూ.. హేమ ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బ తీసేలా హేమ మాట్లాడుతున్నారని, తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని అన్నారు.

హేమ పై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక కరోనా దృష్యా ఎన్నికలు ఎపుడు నిర్వహించాలనే విషయం పై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని.. మీడియా సమావేశంలో నరేష్ చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో నరేశ్‌, జీవితలతో పాటు పాటు హీరో శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం :