దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి!

Published on Aug 10, 2021 2:35 pm IST


తన నటన తో ఆకట్టుకుంటున్న యువ నటుడు నవీన్ పోలిశెట్టి తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాదసాహెబ్ ఫాల్కే అవార్డు ఇంటికి వచ్చింది అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దాదసాహెబ్ ఫాల్కే అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఏజెంట్ చిత్రానికి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ తీవ్రత ఉండటం కారణం గా కార్యక్రమాన్ని నిర్వహించడం జరగలేదు అని అన్నారు. అందుకే అవార్డ్ ను ఇంటికి పంపినట్లు తెలిపారు.

అవార్డ్ వచ్చిన సమయం లో ఇంట్లో ఎవరు లేరని, ఇంటి వాచ్ మెన్ ఉన్నారని, వాచ్ మెన్ కి అవార్డ్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే మా బిల్డింగ్ లో మొట్టమొదటి అవార్డ్ వచ్చిన వ్యక్తి గా అతను ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రానికి అవార్డ్ రావడం పట్ల నెటిజన్లు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :