మీ మౌనాన్ని చరిత్ర క్షమించదు అంటున్న ప్రకాష్ రాజ్

మీ మౌనాన్ని చరిత్ర క్షమించదు అంటున్న ప్రకాష్ రాజ్

Published on Dec 20, 2019 10:35 AM IST

Prakash Raj

కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది దేశ పౌరులు ముఖ్యంగా ముస్లింలు ప్రొటెస్ట్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు ఉద్యమకారులు తమ ప్రాణాలు కోల్పోయారు. మోడీ ప్రభుత్వంపై ఎప్పుడూ తనదైన విమర్శలతో విరుచుకుపడే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

‘చట్టాన్ని చంపేసే లోపు ఇంకెంత మందిని చంపుతారు మీరు అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘నోట్ల రద్దు వలె మనుషులను కూడా రద్దు చేస్తున్న ఇలాంటి క్రైమ్ మినిస్టర్స్ ని చరిత్ర మరిసిపోవచ్చు..కానీ ఇలాంటి విషయాలపై మాట్లాడకుండా మౌనంగా చూస్తున్న మనల్ని చరిత్ర క్షమించదు’ అని మరో ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సి ఏ బి పై నోరు మెదపకపోవడాన్ని అనేకమంది ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరోలను ఏకిపారేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు