నటుడు రాజశేఖర్ కు తల్లి మరణం !


సీనియర్ నటుడు డా.రాజశేఖర్ కు మాతృ వియోగం సంభవించింది. ఆయన తల్లి ఆండాళ్ వరదరాజన్ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగానే ఆమె మరణించారు. 82 ఏళ్ల వరదరాజన్ కు ముగ్గురు కుమారులుం ఇద్దరు కుమార్తెలు కాగా వారిలో రాజశేఖర్ రెండవవారు.

తల్లి మరణంతో విషాదంలో మునిగిపోయిన రాజశేఖర్ కు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియపరచారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఆమె భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రిలోనే ఉంచి చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన రాజశేఖర్ కు మరియు ఆయన కుటుంన సభ్యులక ఈ కష్టాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని 123తెలుగు.కామ్ కోరుకుంటోంది.