మెగా హీరో తండ్రిగా బాహుబలి కట్టప్ప

Published on Jul 14, 2019 8:00 pm IST

సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రంగా మారుతి దర్శకత్వంలో “ప్రతి రోజు పండగే” చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.మరోమారు రాశి ఖన్నా ధరమ్ తేజ్ సరసన నటిస్తుండగా గీతా ఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బాహుబలి కట్టప్పగా పేరుగాంచిన నటుడు సత్యరాజ్ “ప్రతిరోజూ పండగే” చిత్రంలో ధరమ్ తేజ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్నీ ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా తెలిజేశారు. సత్యరాజ్ సినీ ప్రవేశం చేసి 41సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో ధరమ్ తేజ్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కమల్ హాసన్ హీరోగా 1978లో విడుదలైన “సత్తం ఎన్ కైయిల్” చిత్రంతో నటుడు సత్యరాజ్ సినీరంగ ప్రవేశం చేయడం జరిగింది. ఈ 41ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన విలన్,హీరో,క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇలా అనేక వైవిధ్యమైన పాత్రలు చేశారు.

సంబంధిత సమాచారం :

X
More