మెలోడీ బ్రహ్మ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు… మందులోడ చిన్న గ్లింప్స్ మాత్రమే!

Published on Jul 11, 2021 4:02 pm IST

కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం లో సుధీర్ బాబు లైటింగ్ సూరి బాబు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సుధీర్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మందులోడ అనే పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. అయితే నేడు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా సుధీర్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మెలోడీ బ్రహ్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అన్నారు. అంతేకాక మందులోడ పాట కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే అని అన్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఆల్బమ్ ఇంకా పెద్దది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం లో పావేల్ నవగీతన్, నరేష్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్షవర్ధన్, సప్తగిరి, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :