సాయం కోరుతూ కన్నీళ్లు పెట్టుకున్న బుల్లితెర నటి !

Published on Jul 12, 2021 1:49 pm IST

ప్రముఖ బుల్లితెర నటి ‘అనయ సోని’ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె గత వారం తీవ్ర అస్వస్థతకు గురి అవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని హోలీ స్పిరిట్‌ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. కానీ ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి కూడా ఆమె దగ్గర ప్రస్తుతం డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంది.

తన పరిస్థితి వివరిస్తూ సోషల్ మీడియాలో ఆనయ ఒక వీడియో పోస్ట్ చేసింది.’మా అమ్మగారికి ఉన్న గార్మెంట్స్‌ బిజినెస్‌ ఉన్న హౌస్ కి నిప్పంటుకోవడంతో ఆ బిజినెస్ మొత్తం కాలిపోయింది. బట్టలు, మెషీన్లు ఇలా అన్నీ బూడిదయ్యాయి. నిజం చెప్పాలంటే మేము ఇప్పుడు తినడానికి కూడా తిండి లేని దయనీయ పరిస్థితిలో ఉన్నాము. ఆలాగే నాకింకా డయాలిసిస్‌ కూడా మొదలు పెట్టలేదు. కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు. దయచేసి మాకు సాయం చేయండి” అంటూ ఆనయ సోని రిక్వెస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :