ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం !
Published on Oct 23, 2017 6:30 pm IST

‘లీడర్’ సినిమాతో 2010లో టాలీవుడ్ లో ప్రవేశించిన రిచా గంగోపాధ్యాయ్. మూడేళ్లలోనే ఆమె తన గ్లామర్‌తో, నటనతో దక్షిణాదిన ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది. అతి తక్కువ సమయంలో మంచి చిత్రాల్లో నటించింది. ‘మిర్చి’, ‘మిరపకాయ్’, ‘భాయ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రిచా గత కొంతకాలంగా సినిమాలు చెయ్యడం లేదు.

ఆ మద్య తను గ్రాడ్యుయేట్ పూర్తి చేసానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భంలో, చదువు పూర్తి చేసుకున్న తరువాత మళ్ళి సినిమాల్లో నటిస్తుందేమో అనుకున్నారు అంతా. కాని తాజాగా ఆమె ట్విట్టర్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇకపై తానూ సినిమాలు చెయ్యబోనని, నటనకు గుడ్ బై చెప్పబోతునట్లు తెలిపింది. అంతేకాదు, కొత్త జీవితం ప్రారంభిస్తున్నట్లు కూడా వెల్లడించింది.

 
Like us on Facebook