“బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్” తెలుగు ట్రైలర్ త్వరలో!

“బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్” తెలుగు ట్రైలర్ త్వరలో!

Published on May 3, 2024 8:02 PM IST

దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి రూపొందించిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్, మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ షో కి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేయగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీని ప్రకారం, బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనేది బాహుబలి: ది బిగినింగ్‌కి ప్రీక్వెల్‌గా ఉండే అవకాశం ఉంది. అయితే తెలుగులో ట్రైలర్ విడుదల కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు.

ఈ యానిమేటెడ్ సిరీస్ యొక్క తెలుగు ట్రైలర్ అతి త్వరలో విడుదల కానుందని సమాచారం. ఈ ట్రైలర్ రిలీజ్ కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి తెలుగు ప్రేక్షకులకు చాలా ప్రత్యేకమైనది. బాహుబలి మరియు భళ్ళాలదేవ పాత్రలను చూసేందుకు ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హిందీ మరియు తెలుగుతో పాటు, ఇతర భాషలలో కూడా ఈ షో చెప్పిన తేదీ నుండి అందుబాటులో ఉంటుంది.

కాంగ్ మరియు నవీన్ జాన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించగా, రాజమౌళి, శోభు యార్లగడ్డ మరియు దేవరాజన్ దీనిని రూపొందించారు. బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ కంటే ముందు, బాహుబలి ఫ్రాంచైజీలో బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్‌ అనే మరో యానిమేషన్ సిరీస్ ఉందని చెప్పుకోవాలి. రాజమౌళి మరియు శరద్ దేవరాజన్ రూపొందించిన ఈ సిరీస్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు