సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే

సమీక్ష : “ఆ ఒక్కటీ అడక్కు” – కొన్ని నవ్వుల కోసం మాత్రమే

Published on May 4, 2024 3:04 AM IST
Aa Okkati Adakku Movie Review in Telugu

విడుదల తేదీ : మే 03, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు

దర్శకుడు: మల్లి అంకం

నిర్మాత: రాజీవ్ చిలక

సంగీత దర్శకుడు: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ తన హిట్ ట్రాక్ కామెడీ జానర్ లో చేసిన తాజా చిత్రమే “ఆ ఒక్కటీ అడక్కు”. యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ వారం థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వస్తే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి గణపతి(అల్లరి నరేష్) ఎప్పటి నుంచో తన జీవిత భాగస్వామి కోసం వెతుకుతూనే ఉంటాడు కానీ తన జీవితంలో పెళ్లి అనేది అందని ద్రాక్ష లానే ఉండిపోతుంది. ఈ క్రమంలో ఓ మ్యాట్రిమోనీని సంప్రదిస్తాడు. ఆ మ్యాట్రిమోనీ సిధి(ఫరియా అబ్దుల్లా) అండర్ లో ఉంటుంది. అయితే ఆమె పట్ల గణపతి ఫీలింగ్స్ పెంచుకుంటాడు కానీ సిధి వైపు నుంచి గణపతికి ఎలాంటి అనుకూల ఫీలింగ్స్ కనిపించవు. పైగా ఆమె విషయంలో ఓ షాకింగ్ నిజాన్ని కూడా తాను తెలుసుకుంటాడు. మరి ఆ నిజం ఏంటి? ఇంతకీ గణపతి పెళ్లి అవుతుందా లేదా? అయితే ఎవరితో అవుతుంది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాతో అల్లరి నరేష్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామెడి సీన్స్ కానీ తన టైమింగ్ కానీ మళ్ళీ చూడవచ్చు. తన నుంచి ఈ ఎలిమెంట్స్ ఆశించేవారు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే పలు డైలాగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ లో కానీ తన పెర్ఫామెన్స్ నీట్ గా కంపోజ్డ్ గా కనిపిస్తుంది.

ఇక నటి ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో తన రోల్ లో ఇంప్రెస్ చేస్తుంది. ఓ డీసెంట్ పాత్రలో అందులోని తనలోని కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే నరేష్ తో తెరపై ఇద్దరి ప్రెజెన్స్ వారి నడుమ సన్నివేశాలు బాగున్నాయి. ఇక వీరితో పాటుగా హర్ష చెముడు, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రకి న్యాయం చేశారు.

ఇంకా సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ నీట్ గా మెప్పించేలా ఉన్నాయి. వీటితో పాటుగా సినిమాలో ప్రధానంగా కనిపించే ప్రస్తుత రోజుల్లో కనిపించే మోడ్రన్ కుటుంబ సమస్యలు పెళ్లి సంబంధిత ఇచ్చిన సందేశం డీసెంట్ గా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంతో అల్లరి నరేష్ నుంచి పూర్తి స్థాయి వినోదభరిత సినిమా చూద్దాం అనుకునేవారికి కొంతమేర డిజప్పాయింట్ అవ్వొచ్చు. ఇదెలా అంటే సినిమాలో కొంతమేర తన నుంచి కామెడీ ఉంది కానీ సినిమాలో సందేశం దానిని డామినేట్ చేస్తుంది. దీనితో ఈ డోస్ ఎక్కువయిపోతుంది. సో ఆ కొందరు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోవచ్చు.

అలాగే సెకండాఫ్ లో కథనం ఫస్టాఫ్ తో పోలిస్తే కామెడీ యాంగిల్ మిస్ అయ్యి సీరియస్ గానే నడుస్తుంది. వీటితో సెకండాఫ్ మరీ అంత ఎంగేజింగ్ గా అనిపించదు. అలాగే కల్ప లత, జామీ లీవర్ పాత్రలని మరింత బలమైన ఎమోషన్స్ తో ప్రెజెంట్ చేయాల్సింది. ఇంకా వెన్నెల కిషోర్, వైవా హర్ష లను వారి కామెడీ టైమింగ్ లని ఇంకాస్త ఎక్కువ వాడుకొని ఉంటే బాగుండేది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కొంచెం వీక్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సాంకేతిక సిబ్బందిలో గోపి సుందర్ మ్యూజిక్ బాగానే ఉంది. అలాగే సూర్యా సినిమాటోగ్రఫీ బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక డెబ్యూ దర్శకుడు అంకం మల్లి విషయానికి వస్తే.. తాను డీసెంట్ సబ్జెక్టుని పట్టుకున్నారు. అలాగే కామెడీతో ఆ సందేశాన్ని చెప్పే ప్రయత్నంలో రెండు సరిగ్గా బ్యాలన్స్ అవ్వనట్టు అనిపిస్తుంది. రెండు బ్యాలన్స్ గా ఉన్నట్టు అయితే కామెడీకి కామెడీ ఎమోషన్స్ రెండూ సంతృప్తి పరిచేవి కానీ కామెడీ నరేషన్, స్క్రీన్ ప్లే తో నడిచే కథనం ఒక్కసారిగా సీరియస్ టోన్ లోకి మారడంతో టోన్ తడబడుతుంది. ఇదొకటి కరెక్ట్ గా చేసినట్టు అయితే అవుట్ పుట్ మరింత బెటర్ గా అనిపించి ఉండొచ్చు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆ ఒక్కటీ అడక్కు” లో అల్లరి నరేష్ నుంచి కావాల్సిన ట్రీట్ చాలా కాలం తర్వాత దొరుకుతుంది. తనతో పాటుగా ఫరియా అబ్దుల్లా కూడా తన రోల్ లో మెప్పిస్తుంది. అక్కడక్కడా డీసెంట్ కామెడీ కూడా బాగున్నాయి కానీ పూర్తి స్థాయిలో కథనం ఆకట్టుకోదు, కొంతమేర స్లోగా, కొన్ని సీన్స్ బ్యాలన్స్ గా లేకుండా అనిపిస్తాయి. సందేశం కూడా ఓకే అనిపిస్తుంది కానీ దర్శకుడు ఇంకాస్త మెరుగ్గా కథనం నడిపించి ఉంటే బాగుండేది. వీటితో ఈ సినిమాని కాస్త తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేయడం మంచిది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు