“డీజే టిల్లు” టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసిన అలనాటి నటి లయ

Published on Apr 17, 2022 3:34 pm IST


నటి లయ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ కొన్ని సాంగ్స్ ను రీ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి విశేషం గా ఆకట్టుకున్న లయ, తాజాగా మరో మాస్ బీట్ కి స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

లయ డీజే టిల్లు చిత్రం లోని టైటిల్ సాంగ్ కి మాస్ బీట్స్ వేశారు. తన స్నేహితురాలు తో కలిసి వేసిన స్టెప్పులు నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అంతేకాక వీడియో కి భారీ రెస్పాన్స్ వస్తోంది. వీడియో ను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :