వెబ్ సిరీస్ లో నటించనున్న సీనియర్ హీరోయిన్…!

Published on Aug 5, 2019 11:46 pm IST

సీనియర్ హీరోయిన్ మీనా ఓ వెబ్ సిరీస్ నటించడానికి రెడీ అయ్యారు. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమరన్ తెరకెక్కించనున్నారు.త్వరలోనే సెట్స్ పైకెళ్లనున్న ఈ సిరీస్ భక్తి రస ప్రధానంగా తెరకెక్కనుందని సమాచారం.

90లలో తెలుగు,తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన మీనా మొదటిసారి ఓ వెబ్ సిరీస్ నటించడానికి అంగీకరించడం జరిగింది.కొన్ని తెలుగు,తమిళ సీరియల్స్ కూడా నటించారు మీనా. గత కొంతకాలంగా దృశ్యం,మామ మంచు అల్లుడు కంచు వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళం చిత్రాలలో గృహిణిగా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. తాజాగా మమ్ముటి హీరో గా తెరకెక్కనున్న “షై లాక్” చిత్రంలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :