బేల్ ట్రీ హోటల్ కొత్త కిచెన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా నటి మోనాలిసా!

బేల్ ట్రీ హోటల్ కొత్త కిచెన్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా నటి మోనాలిసా!

Published on Dec 20, 2025 10:00 AM IST

Monalisa

హైదరాబాద్‌లోని ప్రముఖ ఆతిథ్య సంస్థ ‘బేల్ ట్రీ’ (Bael Tree) హోటల్ తన నూతన కిచెన్ విభాగాన్ని శనివారం ఘనంగా ప్రారంభించింది. ‘కుంభమేళా’ ఫేమ్, నటి మోనాలిసా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కిచెన్ అంతటా కలియదిరిగి, అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను మరియు అంతర్జాతీయ ప్రమాణాలను అభినందించారు. స్వయంగా కాఫీ తయారు చేసి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచారు.

​హోటల్ అధినేత రాజారెడ్డి మాట్లాడుతూ.. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షం (బేల్ ట్రీ) పేరునే తమ సంస్థకు పెట్టినట్లు తెలిపారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, కస్టమర్లకు అందించే భోజనం తృప్తినిచ్చే ప్రసాదంలా ఉండాలనే ఆధ్యాత్మిక భావనతో ఈ పేరును ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. ఈ పేరు సంస్థలో ఒక పాజిటివ్ వైబ్రేషన్‌ను నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

​మరో యజమాని బాపిరెడ్డి మాట్లాడుతూ.. కస్టమర్ల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక పరికరాలతో, పూర్తి శానిటైజ్డ్ పద్ధతిలో ఈ కిచెన్‌ను డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. సౌత్, నార్త్ ఇండియన్ మరియు కాంటినెంటల్ వంటకాలను అందించడానికి ప్రత్యేక షెఫ్‌లను నియమించినట్లు తెలిపారు. తాజా కూరగాయలు, నాణ్యమైన దినుసులతో ఇంటి రుచిని అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం స్పష్టం చేసింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు