స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా – ప్రియాంక జవాల్కర్

Published on Aug 10, 2021 8:16 pm IST

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక.

తను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు అని తెలిపారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా అనే ఒక డౌట్ ఉండేదని, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు, తిమ్మరుసు విడుదల తరువాత గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయినట్లు తెలిపింది. ఈ మధ్యనే వంట చేసుకోవడం ప్రారంభించినట్లు తెలిపింది. టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశానని, గమనం సినిమాలో తన రోల్ చిన్నదే అయిన బాగా నచ్చి ఒప్పుకున్నాట్లు తెలిపారు.

అయితే తను నటించిన సినిమాలకు తన ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్ అని, వాళ్ళు తను ఎక్కడ బాగా చేసింది, ఎక్కడ మిస్ అయ్యింది వాళ్ళు చెబుతుంటారు అని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ చెప్పినట్లు చెయ్యడమే తన లక్ష్యమని, వారి వల్లే తనకు మంచి రోల్స్ వస్తున్నాయని, బయట తనమీద వచ్చే నెగిటీవ్ ను లైట్ తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు. పాజిటివ్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తా అని తెలిపారు. ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించా, భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, తన డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాన్స్ నేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నట్లు తెలిపారు. త్వరలో ఫైనల్ చేస్తా అని, ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. స్టోరీస్ విన్నా, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదు, నచ్చిన పాత్ర ఏదైనా చేస్తా అని తెలిపారు. తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశానని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా అని అన్నారు.

సంబంధిత సమాచారం :