ధనుష్ చిత్రం లో ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా!

Published on Aug 4, 2021 8:00 pm IST

ధనుష్ 44 వ చిత్రం ను చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరొక పాత్ర కోసం హీరోయిన్ రాశి ఖన్నా ను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అంతేకాక ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ మరియు నటుడు, దర్శకుడు అయిన భారతీ రాజ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు ధనుష్ చిత్రం లో ఇంత భారీ తారాగణం ఉండటం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే చిత్రం కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే చిత్ర యూనిట్ త్వరలో అన్ని విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :