రాజకీయాల్లోకి టాలీవుడ్ హీరోయిన్ !

రాజకీయాల్లోకి టాలీవుడ్ హీరోయిన్ !

Published on Nov 3, 2018 2:29 AM IST

Reshma

సినిమా తారలుగా వెండితెర పై ఒక వెలుగు వెలిగిన కొంతమంది సినీ నటీనటులు రాజకీయాల్లోకి కూడా వచ్చి సక్సెస్ అయినవాళ్లు చాలా మందే ఉన్నారు. కాగా తాజాగా ‘ఈ రోజుల్లో’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేష్మ బీజేపీ తరపున ఎలక్షన్స్ లో పోటీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని ‘వైరా’ నియోజక వర్గం నుంచి ఆమె నిలబడుతుండటం విశేషం.

మరికొన్ని రోజుల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీలో యాక్టివ్ గా ఉన్నందుకే రేష్మకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. త్వరలోనే ఎన్నికల క్యాంపైన్ ను మొదలుపెట్టబోతున్నట్టు రేష్మ తెలియజేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు