ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గత ఏడాది విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం కొంత విరామం తీసుకుంటున్న రామ్, తన నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్‌లపై ప్రత్యేక దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ఆయన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ సిద్ధం చేస్తున్నాడట.
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన లోగి విఘ్నేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇది ఒక సరికొత్త తరహా ‘న్యూ-ఏజ్ యాక్షన్ థ్రిల్లర్’ అని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం రామ్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాడు.
మరోవైపు, తన ఫేవరెట్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో కలిసి రామ్ స్వయంగా ఒక స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాడు. విశేషమేమిటంటే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రామ్ స్వయంగా నిర్మించనున్నాడు. లోగి విఘ్నేష్ సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. వరుస ఫ్లాపుల తర్వాత రామ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆయనను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.


