ప్రముఖ ఆభరణాల సంస్థ ‘గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ’ తన 21వ షోరూంను విజయనగరం ఎంజీ రోడ్డులో శనివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీనటి రితికా నాయక్, జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతులు మెచ్చే విధంగా, అందాన్ని మరింత పెంచేలా ఇక్కడ అద్భుతమైన సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు.
షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అనంతరం గోయాజ్ చైర్మన్ వేములూరి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. నాణ్యమైన ఆభరణాలతో అతి తక్కువ సమయంలోనే తమ సంస్థ ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. షోరూం ప్రారంభం సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు కస్టమర్లకు ప్రత్యేకమైన ఆరంభ ఆఫర్లను (Inaugural Offers) అందిస్తున్నట్లు ప్రకటించారు.


