స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ పై కొన్ని కామెడీ సీన్స్ ని షూట్ చేసారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో ఆద శర్మ జాయిన్ అయ్యింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ తో షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్న ఆద శర్మ తన పాత్ర చాలా క్రేజీగా మరియు ఫన్నీగా ఉంటుందని, అది అందరికీ బాగా నచ్చుతుందని అంటోంది.
అల్లు అర్జున్ సరసన ఆద శర్మ మాత్రమే కాకుండా సమంత, ప్రణిత కూడా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో బన్ని చేయడం ఇదే మొదటిసారి కావడంతో వీరి కాంబినేషన్ బాగుంటుందని ఆశిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో స్నేహ కూడా ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. జులాయి సినిమా నిర్మించిన రాధాకృష్ణ హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


