ఆ హీరో మొదటి ఛాయిస్ థ్రిల్లర్స్.

Published on Jul 14, 2019 9:46 am IST

హీరో అడవి శేషు హీరో గా సినిమాలు చేస్తూనే కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. ఈ నటుడు సోలో హీరోగా ఈ మధ్య విడుదలైన ”గూఢచారి”, “క్షణం” చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఆయన తాజాగా నటించిన “ఎవరు” చిత్రం త్వరలో విడుదల కానుంది. ఐతే ఈ యువ హీరో మరో రెండు చిత్రాలలో నటిస్తున్నారట. వాటిలో ఒకటి “గూఢచారి” మూవీకి సీక్వెల్ “గూఢచారి2″మూవీ కాగా, మరొకటి “మేజర్” అనే చిత్రమట.
ఐతే ఇందులో ఆసక్తికరవిషయం ఏమిటంటే ఈ హీరో ఎక్కువగా సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. తనకు హీరోగా విజయాలు అందించిన ”గూఢచారి”, “క్షణం” చిత్రాలు కూడా ఈ జోనర్ లో తెరకెక్కినవే. ఆయన తాజా చిత్రం “ఎవరు” కూడా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా , పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More