క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తున్న ‘ఎవరు’ ఫస్ట్ లుక్.

Published on Jul 11, 2019 4:20 pm IST

హీరో అడవి శేషు ఒక ప్రక్క హీరో గా సినిమాలు చేస్తూనే, మరో ప్రక్క సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నాడు. ఈ నటుడు సోలో హీరోగా ఈ మధ్య విడుదలైన ”గూఢచారి”, “క్షణం” చిత్రాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఆయన తాజాగా నటించిన “ఎవరు” చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితం చిత్రబృదం విడుదల చేసింది.

ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పోలీస్ యూనిఫారంలో ఉన్న అడివిశేషు కి ఎదురుగా రక్తం అంటిన గాజు ముక్కను పట్టుకొని రెజీనా కాసాండ్రా నిల్చొని ఉంది. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంది. నవీన్ చంద్ర,మురళి శర్మ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా,పీవీపీ బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. వెంకట్ రామ్ జి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More