క్రీడా ప్రధానంగా ఆది పినిశెట్టి “క్లాప్” మూవీ ప్రారంభం.

Published on Jun 12, 2019 4:08 pm IST

కెరీర్ ప్రారంభం నుండి విభిన్న పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడిగా ఎదిగిన హీరో ఆది పినిశెట్టి అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే “క్లాప్” చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తోంది. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా బిగ్ ప్రింట్ పిక్చర్స్ అండ్ సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగాఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రం జూన్ 12న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే వెంటనే ఒకే చెప్పాను.ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. ఈ ‘క్లాప్’ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.రెండు షేడ్స్ వున్నా పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే తపనతో వున్నాను. నిర్మాత కార్తికేయతో ఎప్పటినుంచో పనిచేయాలని చూస్తున్నా,అది ఎప్పటికి సాధ్యమైంది అన్నారు. ఈ మూవీకి పనిచేసిన వారందరు చాలా టాలెంటెడ్ టెక్నిషన్స్ అని అన్నారు.

దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ. కథచెప్పిన వెంటనే కార్తికేయ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టమన్నారు. అలాగే హీరో ఆది కూడా స్టోరీ లైన్ విని వెంటనే ఓకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మూడవ సినిమా. తమిళ్ లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ..మిత్రుడు రాజశేఖర్ చెప్పిన కథ విని చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఇళయరాజా గారి మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్ ఎస్సెట్ కానుంది.ఈ నెల 17నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబిస్తాం. నాజర్, ప్రకాష్ రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మిమే గోపి, సూర్య, మీనా, వాసు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం మాస్ట్రో ఇళయరాజా అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More