‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రిపరేషన్స్ బిగిన్

Published on May 28, 2023 1:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా రామాయణం ఆధారంగా ప్రస్తుతం తెరకెక్కిన భారీ మైథలాజికల్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్. ప్రారంభం నాటి నుండి అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఒక సాంగ్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాయి. రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జూన్ 6న తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ నుండి లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం ప్రస్తుతం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క పనులు మంచి జోరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎందరో ప్రభాస్ అభిమానులతో పాటు పలువురు ప్రేక్షకులు హాజరయ్యేలా యూనిట్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారట. కాగా ఈ మూవీని జూన్ 16న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :