శరవేగంగా “ఆదిపురుష్” షూట్.!

Published on Jul 6, 2021 11:36 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతగా నటిస్తుంది. అయితే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ అనేక ప్లాన్స్ అనంతరం ముంబై షూట్ కే షిఫ్ట్ అయ్యింది.

మరి ఇదిలా ఉండగా మొన్ననే షూట్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలిపిన దర్శకుడు ఓంరౌత్ ఇప్పుడు శరవేగంగా షూట్ ని కొనసాగిస్తున్నాడట. ప్రతిరోజు తెల్లవారు జామునే మేకర్స్ సెట్స్ లో షూటింగ్ ప్రభాస్ లేని టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకొన్నాళ్లలో ప్రభాస్ కూడా జాయిన్ కానున్నాడు. ఇక ఈ భారీ చిత్రానికి ఓంరౌత్ భూషణ్ కుమార్ తదితరులు నిర్మాణం వహిస్తుండగా 3డి లో తెరకెక్కిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగష్టు లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

సంబంధిత సమాచారం :