వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ఆడియోకి ఫ్యాన్సీ రేటు.!

వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ఆడియోకి ఫ్యాన్సీ రేటు.!

Published on Aug 14, 2014 1:54 PM IST

varuteja
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికివరకూ చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ తొలి మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు ఓ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. సుమారు 45 లక్షలకి

ఈ సినిమాకి సంబందించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. సినిమాలో మిగిలి ఉన్న 3 పాటలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘ముకుంద’ లేదా ‘ముకుంద మురారి’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీం ఫైనల్ టైటిల్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు