మేజర్ చిత్రం పై అప్పుడే అప్డేట్…క్లారిటీ ఇచ్చిన అడివి శేష్!

Published on Jul 13, 2021 11:52 pm IST

చిన్న సినిమాల నుండి పాన్ ఇండియన్ సినిమాలు సైతం కరోనా వైరస్ దెబ్బకి ఆగిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు వచ్చినప్పటికీ ఇంకా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉండటం పట్ల పలు చోట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే పాన్ ఇండియా సినిమాలు తమ చిత్రాల విడుదల పై ఒక క్లారిటీ తో ఉన్నట్లు తెలుస్తోంది.

అడివి శేష్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న చిత్రం మేజర్. శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటన ల పై ఉండనుంది. అయితే ఇది భారతీయులు గర్వంగా చెప్పుకొనే చిత్రం అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం విడుదల తేదీ పై తాజాగా నటుడు అడివి శేష్ స్పందించారు. హిందీ లో థియేటర్లు మొదలైన తర్వాత ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ ను ఇస్తాం అని అన్నారు. ఇది మేజర్ చిత్రం భారతీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. జీఏంబీ ఎంటర్ టైన్మెంట్ మరియు సోని పిక్చర్స్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు,శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :