శేష్ అవైటెడ్ “మేజర్” చిత్రం వాయిదా.!

Published on May 26, 2021 10:01 am IST

తనదైన సినిమాలు మరియు స్క్రిప్ట్ వర్క్ తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. తన లైనప్ లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ప్రస్తుత చిత్రాల్లో దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ రియల్ లైఫ్ చిత్రం “మేజర్” కూడా ఒకటి. ఇండియన్ రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ప్లాన్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియన్ రిలీజ్ కు జూలై 2 న ఫిక్స్ అయ్యింది.

కానీ అనూహ్యంగా మళ్ళీ కరోనా ఎఫెక్ట్ పెరగడంతో అధికారికంగా ఈ చిత్రాన్ని ఆ డేట్ నుంచి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. అలాగే కొత్త విడుదల తేదీని తర్వాత తెలియజేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, సహా ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందించాడు. అలాగే ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :