“మేజర్” ఫైనల్ మిషన్ స్టార్ట్ చేసేసిన శేష్.!

Published on Aug 12, 2021 10:03 am IST


తన సినిమాలకు అంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకడు. ఒక్క హీరోగానే కాకుండా మంచి స్క్రిప్ట్ రైటర్ గా టాలీవుడ్ ఆడియెన్స్ లో తన మార్క్ వేసుకున్నాడు. మరి ఇప్పుడు తాను నటిస్తున్న పలు ఆసక్తికర చిత్రాల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం “మేజర్” కూడా ఒకటి. పామ్ ఇండియన్ లెవెల్లో మంచి బజ్ సంతరించుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ని ఇప్పుడు శేష్ రివీల్ చేసాడు.

ఈ చిత్రం ఫైనల్ మిషన్ ను అదే ఫైన షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. కాశ్మిర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సినిమాని అందించాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా మరి క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా మహేష్ మరియు సోనీ పిక్చర్స్ వాలారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :