వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న అడివి శేష్ “మేజర్”

Published on May 7, 2023 8:00 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంలోని నిజ సంఘటనల ఆధారం గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

మే 14, 2023 న సాయంత్రం 6:00 గంటలకు జెమిని టీవీ లో మేజర్ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్, రేవతి, మురళి శర్మ, అనిష్ కురువిళ్ళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జీ. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, a+s మూవీస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :