అడివి శేష్ “గూఢచారి2” పోస్టర్ రిలీజ్!

అడివి శేష్ “గూఢచారి2” పోస్టర్ రిలీజ్!

Published on Dec 30, 2022 9:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన రీసెంట్ హిట్ మూవీ హిట్2 సక్సెస్ తో కెరీర్ లో దూసుకు పోతున్నారు. ఈ ఏడాది రెండు హిట్ చిత్రాలను ప్రేక్షకులను అందించిన ఈ హీరో, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ను షేర్ చేశారు. గూఢచారి చిత్రం కి సంబంధించిన ఒక సరికొత్త పోస్టర్ ను నేడు విడుదల చేశారు.

కొత్త సంవత్సరం స్టార్ట్ కానున్న సందర్భం గా ఫ్యాన్స్ కోసం పోస్టర్ ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. G2 టైటిల్ తో పోస్టర్ ఉంది. పోస్టర్ లోని హీరో గన్ పట్టుకొని ఉన్నారు. ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ఆల్ ఇండియా అనౌన్స్ మెంట్ జనవరి 9 న ఉంటుంది అని తెలిపారు. గూఢచారి మూవీ సూపర్ హిట్ కావడం తో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు