ప్రయోగం ఫలిస్తే విజయం అమోఘం

Published on Aug 22, 2019 1:08 pm IST

యంగ్ హీరో అడివి శేషు టాలీవుడ్ లో వరుస ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ తన విలక్షణతను చాటుకుంటున్నారు. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుక్కుతున్న చిత్రాలలో నటిస్తున్న ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఐతే ప్రయోగాత్మక చిత్రాలతో అపురూప విజయాలను అందుకోవడమనేది ఇక్కడ విశేషం. అందుకు ఎవరు చిత్ర విజయమే ఉదాహరణ.

ఎవరు చిత్రం పై టాలీవుడ్ ప్రముఖులతో పాటు, సాధారణ ప్రేక్షకుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. పట్టు సడలని సన్నివేశాలు, ఊహకు అందని మలుపులతో తెరకెక్కిన ఎవరు చిత్రం వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఒకే రోజు ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే సంభాషణల మధ్య నడిచే సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేసింది. దర్శకుడు వెంకట్ రాంజీ ప్రతిభతో పాటు, అడివి శేషు, రెజీనాల నటన చిత్రాన్నీ మరో స్థాయికి తీసుకెళ్లింది.

టాలీవుడ్ కి ఇలాంటి మంచి చిత్రాలు అందిస్తున్న అడివి శేషుని అభినందించకుండా ఉండలేం. గతంలో కూడా ఆయన క్షణం, గూఢచారి వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించారు.

సంబంధిత సమాచారం :