త్వరలో హీరోగా రానున్న పందిపిల్ల !

త్వరలో హీరోగా రానున్న పందిపిల్ల !

Published on Jul 20, 2018 9:29 AM IST


టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరు ఉంది. ప్రస్తుతం ‘అదుగో’ అనే చిత్రాన్ని రవిబాబు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం మీద మంచి ఆసక్తి ఏర్పడింది. పైగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి.

అయితే ఆగష్టులో ‘అదుగో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కొత్తదనం కోరుకొన్నే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుదట. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు