“ఏజెంట్” తర్వాత సురేందర్ రెడ్డి నెక్స్ట్ పై క్లారిటీ.!

Published on Jun 1, 2023 3:09 pm IST


యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “ఏజెంట్” తనతో పాటుగా దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ లో కూడా ఊహించని పరాజయంగా నిలిచిపోయింది. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఈ ఇద్దరి నెక్స్ట్ సినిమాలు ఏంటి అని అంతా ఆసక్తిగా చూస్తుండగా ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పై అయితే క్లారిటీ తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి నెక్స్ట్ అయితే దిగ్గజ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో అయితే ఓ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్నారట. మరి ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ నే రివీల్ చేశారు. దీనితో అయితే సురేందర్ రెడ్డి నుంచి మరో మాసివ్ ప్రాజెక్ట్ రాబోతుంది అని చెప్పాలి. ఇక దీనితో పాటుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరిన్ని భారీ చిత్రాలు రానున్న రోజుల్లో ఉన్నాయని అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను తో కూడా ఒక సినిమా లాక్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా తాను కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం :